చిరంజీవి పై గుర్రుగా ఉన్న నిర్మాతలు

మెగా స్టార్ చిరంజీవి రెండేళ్ళ క్రితం “ఖైది నెంబర్ 150” సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాతో నిర్మాతగా మారాడు.

అయితే అప్పట్లో చిరంజీవి కం బ్యాక్ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి తెలుగు నిర్మాతలు చాలా మంది పోటీ పడ్డారు. కానీ రామ్ చరణ్ తన తండ్రి సినిమాకోసం కొణిదెల ప్రొడక్షన్స్ ని స్థాపించి ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసి హిట్ అందుకున్నాడు. ఇక అప్పుడు నిర్మాతలు కూడా 150 సినిమా కాబట్టి ఆ సినిమా వదిలేసారు.

కానీ ఇప్పటికీ కూడా బయట నిర్మాతలకి చిరంజీవితో అవకాశం ఇవ్వకుండా తన బ్యానర్ లోనే సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు చరణ్. చిరంజీవి కూడా చరణ్ కి సపోర్ట్ గా నిలిస్తూ డేట్స్ అన్ని రామ్ చరణ్ కే ఇస్తున్నాడు.

మరి చిరంజీవి ఎప్పుడూ సొంత ప్రొడక్షన్ లోనే నటిస్తే ఇక మిగతా ప్రొడ్యూసర్స్ చిరంజీవితో ఎప్పుడు సినిమా చెయ్యాలి అని వారి వాదన. మరి ఫ్యూచర్ లో అయినా వీళ్ళ బాధని అర్ధం చేసుకొని చిరంజీవి బయట ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు చేస్తాడో లేదో చూడాలి.