ఎమోషనల్ లవ్ స్టొరీగా అల్లు అర్జున్ సినిమా

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇది వరకు “జులాయి” “సన్ అఫ్ సత్యమూర్తి” వంటి మంచి సినిమాలు వచ్చాయి. ఇక ముచ్చటగా మూడో సారి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుంది.

ఇటివలే హారిక హాసిని క్రియేషన్స్ ఈ సినిమా పై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. గతంలో అల్లు అర్జున్ తో డ్రామా, యాక్షన్ సినిమాలు తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సారి మాత్రం అల్లు అర్జున్ కోసం ఒక లవ్ స్టొరీ రాశాడు. ఈ లవ్ స్టొరీ కామెడీ గా, రొమాంటిక్ గా కంటే కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది అని టాక్.

మరి “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” వంటి యాక్షన్ సినిమా తరువాత అల్లు అర్జున్ లవ్ స్టొరీ చేయడమే కరెక్ట్ అని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావించాడట. హారిక హాసిని వాళ్ళతో పాటు గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ కూడా ఈ సినిమాకి సహా నిర్మాతగా ఉన్నాడు. ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాని ఈ సినిమాకి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు.