బరువు తగ్గే పనిలో చిరంజీవి

రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత సినిమాలకి దూరం అయిన చిరంజీవి మళ్ళీ దాదాపు పదేళ్ళ తరువాత “ఖైదీ నెంబర్ 150” సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తన స్టామిన ఏంటో నిరూపించుకున్నాడు.

ఆ సినిమా తరువాత మళ్ళీ ఏడాది గ్యాప్ తీసుకొని “సై రా నరసింహా రెడ్డి” సినిమాతో రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

అయితే ఈ సినిమా కోసం మెగా స్టార్ చాలా సన్నగా అవ్వనున్నాడట. కొరటాల శివ రాసుకున్న కథ ప్రకారం హీరో చాలా చురుగ్గా చలాకీగా కనిపించాలట. అలా ఉండాలి అంటే ముందు చిరంజీవి తన వెయిట్ ని కంట్రోల్ చేసుకోవాలి.

అందుకే ఇప్పటి నుంచే కొరటాల శివ సినిమా కోసం సన్నగా అయ్యే పనిలో పడ్డాడట చిరంజీవి. ఏప్రిల్ లేదా మే నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నాడు.