బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

తెలుగు లో బయోపిక్స్ వస్తున్న ఈ తరుణంలో అక్కినేని నాగేశ్వర్ రావు పై కూడా బయోపిక్ వస్తుంది అని నాగార్జున ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు అని అందరూ అన్నారు. కానీ నాగార్జున మాత్రం ఏఎన్నార్ మీద బయోపిక్ చేయట్లేదు అని చెప్పాడు. కానీ మొన్న మాత్రం నాగార్జున ఈ బయోపిక్ ని సినిమా లా కాకుండా వెబ్ సిరీస్ రూపంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు అనే టాక్ కూడా ఫిలిం నగర్ లో వచ్చింది. కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఈ న్యూస్ లో అసలు ఎలాంటి నిజం లేదు… ఇవన్నీ రూమర్స్ అని కొట్టిపడేసాడు.

అసలు మా ఫ్యామిలీ ఎప్పుడు ఏఎన్నార్ బయోపిక్ గురించి ఆలోచించలేదు, అసలు మాకు ఆయన సినిమాలు రీమేక్ చేయాలి అంటేనే చాలా భయం. అలాంటిది మేము ఏఎన్నార్ బయోపిక్ ని ఎలా చేస్తాము. ఆయన బయోపిక్ అస్సలు ఉండదని చాలా స్ట్రాంగ్ గా చెప్పేసాడు నాగార్జున. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున “మన్మధుడు 2” “బంగార్రాజు” సినిమాల స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు.