అనీషా ఆంబ్రోస్ పెళ్లి కుదిరింది

మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమె పేరు అనీషా ఆంబ్రోస్. సినిమాలతో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇక పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోదామనుకుంటోంది ఈ బ్యూటీ. తనకు కొన్నేళ్లుగా పరిచయమున్న గుణ జక్క అనే వ్యక్తిని పెళ్లాడబోతోంది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అనీషా-గుణకు నిశ్చితార్థం అయిపోయింది. అది కూడా దాదాపు నెల రోజుల కిందటే. కాకపోతే ఈ విషయాన్ని ఆమె ఎక్కడా బయటపెట్టలేదు. కనీసం ఎంగేజ్ మెంట్ కు స్నేహితుల్ని కూడా పిలవలేదు. ఎందుకో అలా సీక్రెట్ గా కానిచ్చేశారు. వచ్చేనెలలో పెళ్లి పెట్టుకున్నారు. కనీసం పెళ్లికైనా ఫ్రెండ్స్, సినీప్రముఖుల్ని పిలుస్తుందో లేదో చూడాలి.

అలియాస్ జానకి సినిమాతో ఇండస్ట్రీకొచ్చింది అనీషా. దాదాపు అరడజను సినిమాలు చేసింది. కానీ ఏదీ ఆమెకు పెద్దగా క్రేజ్ తీసుకురాలేదు. రీసెంట్ గా ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం సెవెన్ (7) అనే సినిమాతో పాటు విఠలాచార్య అనే మరో సినిమాలో హీరోయిన్ పాత్రలు పోషిస్తోంది ఈ భామ.