ఆడియో లాంచ్ లో నోరు జారిన అలీ

స్టార్ కమెడియన్ అలీ అటు కమెడియన్ గా సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో లాంచ్ ఈవెంట్ లని హోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇలా అలీ యాంకర్ సుమతో కలిసి ఎన్నో ఆడియో ఈవెంట్స్ లో యాంకరింగ్ చేసాడు.

కానీ చాలా సార్లు అలీ పబ్లిక్ లో అసభ్యంగా మాట్లాడుతూ మీడియా కి దొరికిపోయాడు. ఇక ఇటీవలే “లవర్స్ డే” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అలీ యాంకరింగ్ చేస్తూ మరోసారి తన నోరు జారాడు.

ఈ ఈవెంట్ లో సుమ… ప్రియా వారియర్ ఇక్కడున్న వారందరికీ చెల్లి అవుతుందని అని చెప్పింది. అలీ ని ఆట పట్టిస్తూ అలీకి కూడా ప్రియా వారియర్ చెల్లె అవుతుందని స్టేట్మెంట్ ఇచ్చింది. దీనికి అలీ సెటైర్ గా మరి రోషన్ నీకు కొడుకు అవుతాడా అని అన్నాడు. దానికి సుమ అవును కొడుకే అవుతాడని అనంటే, మరి రాజీవ్ కనకాల ఎప్పుడు కేరళ వెళ్ళాడు అనే డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టాడు.

ఈ ఈవెంట్ చూసినవారంతా అసలు అలీకి కనీస మర్యాద లేదు అని తిడుతున్నారు. మరి అలీ దీని పై మీడియా ముందుకు వచ్చి ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.