నో రిస్క్.. బడా నిర్మాత నయా ఫార్ములా

మొదట్నుంచి దిల్ రాజు ఫార్ములా ఇదే. భారీ బడ్జెట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడు. కాకపోతే అడపాదడపా డీజే లాంటి హెవీ మూవీస్ తో పాటు సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి మల్టీస్టారర్ మూవీస్ కూడా తీశాడు. అయితే ఇకపై ఇలాంటి ప్రయోగాలు కూడా చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఈ హీరో. ఇందులో భాగంగా రిస్క్ కు దూరంగా ఉండేందుకు కొన్ని ప్రాజెక్టులు కూడా పక్కనపెట్టేశాడు.

వీటిలో ముందు వరుసలోకి వస్తుంది ఇండియన్-2. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా దిల్ రాజు నిర్మామ సారధ్యంలో గ్రాండ్ గా ఎనౌన్స్ చేశారు ఈ ప్రాజెక్టు. కానీ భారీ బడ్జెట్ కావడంతో పాటు కథలో తన ప్రమేయం ఉండదని తెలుసుకున్న దిల్ రాజు, ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇది మాత్రమే కాదు.. రీసెంట్ గా దాగుడు మూతలు ఆగిపోవడానికి కూడా ఇదే రీజన్.

హరీష్ శంకర్ రాసిన దాగుడుమూతలు ప్రాజెక్టు  ఓ మల్టీస్టారర్. ఇద్దరు హీరోలకు రెమ్యూనరేషన్ ఇవ్వాలి. పైగా కథ ప్రకారం అమెరికాలో లాంగ్ షెడ్యూల్స్ కూడా అవసరం. తను అనుకున్న బడ్జెట్ కంటే ఇది హద్దులు దాటిపోతోంది. అందుకే నిర్మోహమాటంగా ఈ ప్రాజెక్టును కూడా పక్కనపెట్టేశాడు దిల్ రాజు.

అంతేకాకుండా వీటితో పాటు మరో గాసిప్ కూడా వినిపిస్తోంది. లెక్కప్రకారం, తనే సోలో హీరోగా మహేష్ తో ఓ మూవీ చేయాలి. కానీ బడ్జెట్ లిమిటేషన్స్ కారణంగా ఆ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకొని, మహర్షి సినిమాలో నిర్మాణ భాగస్వామ్యం తీసుకున్నాడట దిల్ రాజు. ఇలా బడా సినిమాలకు దూరంగా సేఫ్ వెంచర్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు.