సెట్స్ పైకొచ్చిన శంకర్.. చేతిలో గన్

మొన్న ప్రారంభమైన ఇస్మార్ట్ శంకర్ సినిమా నిన్నటి నుంచి సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ లోనే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా రామ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. పనిలోపనిగా 3 డైలాగ్స్ కూడా చెప్పించాడు.

ఈ సినిమాతో రామ్ కు కంప్లీట్ గా  ఓ కొత్త ఇమేజ్ ఇచ్చేపనిలో పడ్డాడు పూరి. హీరోల్ని పూర్తిగా మార్చేస్తాడనే ఇమేజ్ ఉన్న పూరి, రామ్ ను రఫ్ అండ్ టఫ్ అబ్బాయిగా చూపించబోతున్నాడు. ఈ సినిమా కోసం అచ్చమైన తెలుగమ్మాయిని హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. త్వరలోనే ఆమె పేరు, వివరాల్ని బయటపెట్టబోతున్నారు.

హైదరాబాద్ షెడ్యూల్ 3 వారాల పాటు ఉంటుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని, నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని వెల్లడిస్తారట. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయబోతున్నారు.