తన సినిమాకి ప్రొడ్యూసర్ గా మారిన నాని

న్యాచురల్ స్టార్ నాని గతంలో వచ్చిన “డి ఫర్ దోపిడీ” అనే సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించాడు. ఆ సినిమా తరువాత నాని మళ్ళి కొంత కాలం గ్యాప్ తీసుకొని ఈ సారి డైరెక్ట్ నిర్మాతగా “అ” అనే సినిమాని ప్రొడ్యూస్ చేసాడు. ఈ సినిమా నానికి మంచి హిట్ ని తెచ్చి పెట్టింది. ఇక మళ్ళి సినిమా నిర్మాణం వైపు వెళ్ళని నాని ప్రస్తుతం “జెర్సీ” సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. గౌతం తిన్నురి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత నాని మైత్రి మూవీ మేకర్స్ వారి ప్రొడక్షన్ హౌస్ లో విక్రం కే కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు.

ఇక ఈ రెండు సినిమాల తరువాత తానే హీరోగా ఉంటూ ప్రొడ్యూసర్ గా సినిమా చేయాలి అని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత నాని దిల్ రాజు బ్యానర్ లో మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు, ఒకవేళ ఉంటే నాని ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి అటు హీరోగా ఇటు ప్రొడ్యూసర్ గా నాని సినిమాని మేనేజ్ చెయ్యగలడో లేదో చూడాలి.