అప్పుడు కార్… ఇప్పుడు బైక్

 సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది “గీత గోవిందం” “టాక్సీ వాలా”  సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. అసలు “టాక్సీ వాలా”  సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఫస్ట్ హారర్ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాలో టాక్సీ డ్రైవర్ గా నటించిన విజయ్ దేవరకొండ కి ఒక కార్ ఉంటుంది. కాకపొతే ఆ కార్ లో దయ్యం కూడా ఉంటుంది. పూర్తి స్థాయి హారర్ సినిమాగా తెరకెక్కిన “టాక్సీ వాలా” విజయ్ దేవరకొండ కి థ్రిల్లర్ హిట్ ని ఇచ్చింది.

ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ మళ్ళీ ఇలాంటి కథనే ఒకటి ఓకే చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. కాకపొతే ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్ మాత్రం ఉండదట.

ఇటీవలే ఒక తమిళ దర్శకుడు విజయ్ దేవరకొండ దగ్గరకి బైక్ చుట్టూ తిరిగే ఒక కథని తీసుకొని వచ్చాడు. ఈ కథ బాగా నచ్చిన విజయ్ వెంటనే సినిమా ఓకే చేసాడు అని తెలుస్తుంది. ప్రస్తుతం “డియర్ కామ్రేడ్” తో పాటు క్రాంతి మాధవ్ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాల తరువాత ఆ తమిళ దర్శకుడి కథ ఓకే చేస్తాడట.