“96” వివరాలు బయటపెట్టిన దిల్ రాజు

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా 96 సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారనే విషయం అందరికీ తెలిసిపోయింది. దీనిపై చాలా కథనాలు కూడా వచ్చేశాయి. అలా ఇప్పటికే జనాలకు చేరిపోయిన ఈ ప్రాజెక్టును దిల్ రాజు అఫీషియల్ గా ప్రకటించాడు. తమ బ్యానర్ పై 34వ చిత్రంగా 96 రీమేక్ ను చేయబోతున్నామంటూ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించాడు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మార్చి నుంచి సెట్స్ పైకి రాబోతోంది ఈ సినిమా. ఈ గ్యాప్ లో అటు సుధీర్ వర్మ సినిమాను శర్వానంద్, నందినీరెడ్డి సినిమాను సమంత పూర్తిచేయబోతున్నారు. ఒరిజినల్ సినిమాను డైరక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ రీమేక్ ను కూడా హ్యాండిల్ చేయబోతున్నాడు.

కేవలం దర్శకుడు మాత్రమే కాదు, 96 సినిమాకు సంబంధించి చాలామంది మ్యూజిక్ డైరక్టర్ నుంచి చాలామంది టెక్నీషియన్లను ఒరిజినల్ సినిమాకు పనిచేసిన వాళ్లనే తీసుకున్నారు. దర్శకుడికి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు రీమేక్ లో ఫీల్ చెడకూడదనే ఉద్దేశంతో దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నాడు.