మిస్టర్ మజ్ను ఫస్ట్ డే కలెక్షన్

 మొదటి సినిమా అఖిల్, రెండో సినిమా హలోతో పోల్చి చూస్తే మిస్టర్ మజ్ను బెటర్ అనిపించుకున్నాడు. సమీక్షల పరంగా కాదు, వసూళ్ల పరంగా. అవును.. గత రెండు సినిమాలతో పోలిస్తే మిస్టర్ మజ్ను ఓపెనింగ్స్ బాగున్నాయి. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు మొదటి రోజు 4 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
అఖిల్ మూడో సినిమాకే ఈ షేర్ అంటే అది మంచి ఫిగరే. కాకపోతే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. పాజిటివ్ టాక్ వచ్చుంటే, స్టడీగా నిలబడి బ్రేక్-ఈవెన్ అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి చేజారిపోయింది. ఈ వీకెండ్ గడిస్తే తప్ప మిస్టర్ మజ్ను పరిస్థితి ఏంటనేది చెప్పలేం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫస్ట్ డే షేర్ ఇలా ఉంది.
నైజాం – రూ. 1.08 కోట్లు
సీడెడ్ – రూ. 0.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.46 కోట్లు
ఈస్ట్ – రూ. 0.12 కోట్లు
వెస్ట్ – రూ. 0.17 కోట్లు
గుంటూరు – రూ. 0.54 కోట్లు
కృష్ణా – రూ. 0.26 కోట్లు
నెల్లూరు – రూ. 0.12 కోట్లు