ఇవేం అరుపులు “సీత”

 నిన్న తన కొత్త సినిమా సీత టైటిల్ లోగో రిలీజ్ చేశాడు దర్శకుడు తేజ. ఆ టైటిల్ చూసి సినిమా కూడా అంతే క్యూట్ గా ఉంటుందని అంతా భావించారు. తీరా ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత తేజ అస్సలు మారలేదని అర్థమైంది. తనకు నచ్చింది, తనకు బాగా అలవాటైంది మాత్రమే తేజ తీశాడని చెప్పకనే చెబుతోంది ఈరోజు విడుదలైన ఫస్ట్ లుక్.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ నటిస్తున్న సీత సినిమాకు సంబంధించి హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ స్టిల్ లో బెల్లంకొండ అదోలా అరుస్తున్నాడు. కాజల్ మాత్రం అతడివైపు ఆశ్చర్యకరంగా చూస్తోంది. ఇదేం ఫస్ట్ లుక్కో ఎవరికీ అర్థంకాలేదు.

Gear up guys.. Here it is!!! Presenting #sitafirstlook.#DirectorTeja Kajal Aggarwal #freakycouple ?#happyrepublicday… 2019

Posted by Bellamkonda Sreenivas on Friday, 25 January 2019

ఫస్ట్ లుక్స్ అంటే ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ఓ రకమైన అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయానికి పూర్తి భిన్నంగా సీత ఫస్ట్ లుక్ రిలీజయ్యేసరికి అంతా ఖంగుతిన్నారు. రేపట్నుంచే మూవీ ప్రచారం కూడా స్టార్ట్ చేస్తానంటున్న తేజ, మార్చిలో సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు. చూద్దాం.. ఈ అరుపులు థియేటర్లలోనైనా పనిచేస్తాయేమో.