గోపీచంద్ సినిమాని రిజెక్ట్ చేసిన ఇద్దరు హాట్ బ్యూటీస్

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. గోపీచంద్ స్పై గా నటుస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇండియా పాకిస్థాన్ బోర్డర్ లో జరుగుతుంది.

ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించమని హాట్ బ్యూటీ లక్ష్మి రాయ్ ని కోరారట మూవీ యూనిట్. కానీ ఆమె ఈ సినిమాలో నటించడానికి భారీగా డిమాండ్ చేసిందట. ప్రొడ్యూసర్స్ అంత ఇచ్చుకోలేము అని చెప్పారట.

ఈ సారి మరో హీరోయిన్ గా హంస నందినిని నటించమని కోరారు మూవీ యూనిట్. ఆమె కూడా దాదాపు ఆ రేంజ్ లోనే అడగటంతో ఆమెని కూడా లైట్ తీసుకున్నారట.

ఇక ఇప్పుడు ఈ సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ జరిన్ ఖాన్ ని అడిగే ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే హీరోయిన్ కి ఎంత ఇవ్వడానికైనా నిర్మాతలు రెడీ గా ఉంటారు. కానీ ఇక్కడ సినిమా బడ్జెట్ ఎక్కువవుతుండడటంతో హీరోయిన్ కి తక్కువ ఇచ్చుకుందాం అనేది మూవీ యూనిట్ ప్లాన్.