15 రోజుల్లో రూ. 68 కోట్లు

విడుదలై 2 వారాలైన ఇప్పటికీ ఎఫ్2 హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు అదనంగా మరో 5 కామెడీ సీన్లు యాడ్ చేయడంలో ఈ వీకెండ్ వసూళ్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. దీనికి తోడు సినిమాలో కామెడీ బాగా క్లిక్ అవ్వడంతో రిపీట్ ఆడియన్స్ పెరిగారు.  ఫలితంగా విడుదలైన 15 రోజులకే ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది ఎఫ్2 సినిమా.

వెంకీ, వరుణ్ కెరీర్స్ లో ది బెస్ట్ మూవీ ఇదే కాగా.. టాలీవుడ్ హిస్టరీలో టాప్ -10 మూవీస్ లో ఒకటిగా చేరడానికి ఇది చాలా కొద్దిదూరంలో ఉంది. ఆదివారం నాటి వసూళ్లతో ఇది టాలీవుడ్ టాప్-10 సినిమాల సరసన చేరిపోవడం ఖాయం. మరోవైపు ఓవర్సీస్ లో ఈ సినిమా దిగ్విజయంగా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. ఏపీ, నైజాంలో ఎఫ్-2 సినిమాకు విడుదలైన ఈ 15 రోజుల్లో వచ్చిన షేర్ ఇలా ఉంది.

నైజాం – రూ. 19.48 కోట్లు

సీడెడ్ – రూ. 7.24 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.57 కోట్లు
ఈస్ట్ – రూ. 6.10 కోట్లు
వెస్ట్ – రూ. 3.55 కోట్లు
గుంటూరు – రూ. 4.93 కోట్లు
కృష్ణా – రూ. 4.48 కోట్లు
నెల్లూరు – రూ. 1.65 కోట్లు