వాల్మీకిగా వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా స్టార్ట్ చేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమా లాంచ్ చేశాడు వరుణ్. ఈరోజు ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. వరుణ్ చెల్లెలు నిహారిక ఈ ఓపెనింగ్ కు ప్రత్యేక అతిథిగా వచ్చి అన్నయ్యపై క్లాప్ కొట్టింది. డైరక్టర్ వీవీ వినాయక్ కెమెరా స్విచాన్ చేశాడు. మరో దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
తమిళ్ లో హిట్ అయిన జిగర్ తాండా అనే సినిమాకు రీమేక్ ఇది. తమిళ్ లో బాబి సిమ్హా పోషించిన విలన్ పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేయబోతున్నాడు. ఇది నెగెటివ్ షేడ్స్ తో సాగే పాత్ర. ఇలాంటి పాత్ర చేయడం వరుణ్ కు ఇదే ఫస్ట్ టైం. అంతేకాదు, మెగా కాంపౌండ్ లో నెగెటివ్ షేడ్స్ లో ఓ క్యారెక్టర్ చేస్తున్న హీరో కూడా ఇతడే కావడం విశేషం.
జిగర్ తాండాలో సిద్దార్థ్ పోషించిన పాత్రకు తెలుగులో ఇంకా నటుడ్ని ఎంపిక చేయలేదు. దీంతోపాటు హీరోయిన్ ఎంపిక కూడా పెండింగ్ లో ఉంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.