“ఎన్టీఆర్” బయోపిక్ పై స్పందించిన తేజ

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ వస్తుంది అని తెలియగానే అందరి దృష్టి ఆ సినిమా పై పడింది.  నందమూరి బాలక్రిష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ లో నటించాడు. కానీ రిలీజ్ అయిన తరువాత మాత్రం “ఎన్టీఆర్” బయోపిక్ ఎవరి అంచనాల్ని అందుకోలేక…. ఫ్లాప్ అయింది.

క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అటు ఓవర్సీస్ లో కూడా హిట్ అవ్వలేదు. అయితే ఈ సినిమాని మొదట తేజ డైరెక్ట్ చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.

ఇక ఇటీవలే తేజని “ఎన్టీఆర్” ఫ్లాప్ గురించి అడిగితే తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల “ఎన్టీఆర్” బయోపిక్ చూడలేదని చెప్పాడు. ఈ సినిమాలో డ్రామా వర్క్ అవుట్ అవ్వలేదని జనాలు అంటున్నారు…. దాని పై మీ స్పందన ఏంటి అని అడిగితే, “అది సినిమా తెరకెక్కించే డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటది. ఒక సినిమాలో డ్రామా వర్క్ అవుట్ అవ్వాలి అంటే డైరెక్టర్ మెదడు పెట్టాలి” అంటూ వ్యాఖ్యలు చేసాడు తేజ. దీన్ని బట్టి చూస్తే “ఎన్టీఆర్” ఫ్లాప్ అయ్యింది క్రిష్ వల్లే అని అర్ధం వచ్చేలా తేజ కామెంట్స్ చేశాడు.