వైఎస్ జగన్ ను కలిసిన ఆర్.కృష్ణయ్య

బీసీల రిజర్వేషన్ బిల్లుపై చట్టసభల్లో చర్చ జరపాలని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ను కోరినట్లు బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ బిల్లు గురించి జగన్ కు 14 పేజీలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్లు చెప్పారు.

ఇక ఈ అంశం గురించి రాజ్యసభలో తమ పార్టీ తరపున చర్చిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు ఆర్.కృష్ణయ్య చెప్పారు. ఏలూరులో నిర్వహించే బీసీ గర్జనకు తనను హాజరు కావాల్సిందిగా జగన్ కోరినట్లు చెప్పారు. బీసీల కోసం ఏ పార్టీ పిలిచినా….సభలు నిర్వహించినా….మాట్లాడేందుకు వెళ్తానని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.