పెళ్లిచూపులు దర్శకుడితో మహేష్

పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. కానీ ఆ సక్సెస్ ట్రాక్ ను అలానే కొనసాగించలేకపోయాడు. తన రెండో ప్రయత్నంగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తరుణ్ చేసిన “ఈ నగరానికి ఏమైంది” సినిమా అంతగా ఆడలేదు. అయినప్పటికీ తరుణ్ కు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆ క్రేజ్ అలానే కొనసాగుతోంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ దర్శకుడు అర్జెంట్ గా ఓ హిట్ కొట్టాలి.

హిట్ కొట్టే ప్రయత్నంలో భాగంగా మహేష్ బాబుకు ఓ కథ వినిపించాడట ఈ దర్శకుడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఇదే. నమ్రత రిఫరెన్స్ తో మహేష్ ను కలిసిన తరుణ్ ఓ మంచి స్టోరీలైన్ ను వినిపించాడట. స్టోరీలైన్ మహేష్ కు బాగా నచ్చిందట, దాన్ని డెవలప్ చేయమని చెప్పాడట.

అంతా బాగానే ఉంది కానీ ఫుల్ బిజీగా ఉన్న మహేష్ తో సినిమా చేసే అవకాశం తరుణ్ కు ఎప్పుడొస్తుందనేది డౌట్. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న మహేష్, ఆ వెంటనే సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. సుకుమార్ సినిమా పూర్తయిన తర్వాత అనీల్ రావిపూడి లేదా సందీప్ రెడ్డి వంగ లలో ఒకరికి ఛాన్స్ ఇస్తాడనే టాక్ నడుస్తోంది. మరి తరుణ్ కు ఎప్పుడు అవకాశం వస్తుందో…!