లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై బాబు ఫైర్‌… వెంటనే వర్మ రియాక్ట్

రాంగోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారు. రోజూలాగే ఉదయమే టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు… లక్ష్మీస్ ఎన్టీఆర్‌ అంశాన్ని ప్రస్తావించారు.

లక్ష్మీస్ఎన్టీఆర్‌లో చంద్రబాబు వెన్నుపోటు అంశం ప్రధానంగా ఉండే అవకాశం ఉండడంతో చంద్రబాబు ధ్వజమెత్తారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను బహిష్కరించాలని టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సినిమాను చూడవద్దన్నారు.

కొందరు చరిత్రను వక్రీకరించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ చరిత్ర తెలుసుకోవాలంటే బాలకృష్ణ తీసిన కథనాయకుడు, మహానాయకుడు సినిమాలను చూడాలని చంద్రబాబు సూచించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడం
కుట్రలో భాగమన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ వెంటనే ట్విట్టర్‌లో స్పందించారు. ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని…. కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపును ప్రస్తావిస్తూ వర్మ… ట్విట్టర్‌లో పోల్ పెట్టారు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌ తీసిన తనది…. కుట్రా? నిజమా? చెప్పాలని నెటిజన్లను వర్మ కోరారు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రానికి చంద్రబాబు వణికిపోతున్నారని వర్మ వ్యాఖ్యానించారు.