ఈ మాసిపోయిన ‘షూ’ ఖరీదు 61 వేల రూపాయలు..!

మనం బట్టలో, చెప్పులో ఇంకో వస్తువో కొనడానికి షాప్‌కి వెళ్లామనుకోండి. అక్కడ మనకు చూపించే వస్తువు కాస్త మురికిగా, డల్ కలర్‌తో కనిపిస్తే కొంటామా..? సెకెండ్ హ్యాండ్ వస్తువైనా తళతళలాడుతూ కనిపించాలనుకునే మనస్థత్వం ఎవరికైనా ఉంటుంది.

కానీ గుచ్చీ సంస్థ ఇటీవల విడుదల చేసిన కొత్త మోడల్ స్నికర్స్ (షూ)ని చూసి ఇదేం మోడల్ అని పెదవి విరుస్తున్నారు. మరోవైపు దాని ధర చూసి ఇదేం చోద్యమని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. ఎవరో బాగా వాడేసిన షూని షోకేసుల్లో పెట్టి అమ్ముతున్నట్లు అనిపించడమే. ఇక దాని ధర 870 డాలర్లు అనగా అక్షరాలా 61వేల రూపాయలు.

ఆ షూని చూసి నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఎవరో గత ఆరు నెలలుగా వాడి పారేసిన షూని అమ్ముతునారు అంటూ ఒకరు ట్రోల్ చేయగా.. ఈ షూ ఎవరి కోసమంటే, కొత్త షూని బయటకు వేసుకొని వెళ్లి మురికి చేయడానికి కూడా బద్దకం ఉన్న వాళ్ల కోసమంటూ మరొకరు ట్వీట్ చేశారు.

నిజమే కదా.. అసలు ఇలా మాసిపోయిన షూను ఎవరైనా 61 వేలు పోసి కొంటారా..?