విశ్వాసం క్లోజింగ్ కలెక్షన్

అజిత్‌కు తెలుగులో అస్సలు మార్కెట్ లేదనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. తమిళనాట అతడు నటించిన సినిమా ఆల్ టైమ్ హిట్ అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులు దాన్ని పట్టించుకోలేదు. అదే విశ్వాసం సినిమా. సెంటిమెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కోలీవుడ్‌లో అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రజనీకాంత్ నటించిన ‘పేట’ సినిమాను కూడా క్రాస్ చేసింది.

అలాంటి సినిమా కాస్తా తెలుగులో తుస్సుమంది. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఎలాంటి పోటీ లేదు. ఏమాత్రం బజ్ వచ్చినా, ఎలాంటి సినిమానైనా చూడ్డానికి జనం రెడీ. ఇలాంటి స్లంప్‌లో కూడా విశ్వాసం సినిమా తెలుగు ఆడియన్స్‌కు ఎక్కలేదు. ఫలితంగా ఈ సినిమా దాదాపు తన థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది.

ఇప్పటివరకు ఈ సినిమాకు కేవలం కోటి 10 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ హక్కుల్ని అటుఇటుగా 3 కోట్ల రూపాయలకు దక్కించుకుంటే, ఆమాత్రం ఎమౌంట్ కూడా వచ్చేలా కనిపించడం లేదు. మరోవైపు నష్టపోయిన మొత్తాన్ని శాటిలైట్ రైట్స్ రూపంలో అందుకునేందుకు నిర్మాతలు తెగ కష్టపడుతున్నారు. ఆల్రెడీ రిలీజై, ఫ్లాప్ అయిన ఈ సినిమాను తెలుగులో ఏ ఛానెల్ దక్కించుకుంటుందో చూడాలి.