చరణ్ భార్య రిలీజ్ చేసిన టీజర్ ఇది

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం కథనం. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకోగా, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ ని రామ్ చరణ్ భార్య ఉపాసన రిలీజ్ చేశారు.

క్షణం, రంగస్థలం సినిమాల తర్వాత అనసూయ చేస్తున్న సినిమా ఇది. మరీ ముఖ్యంగా ఆమెది ఇందులో క్యారెక్టర్ రోల్ కాదు. లీడ్ పాత్ర ఆమెదే. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో స్టయిలిష్ గా కనిపించబోతోంది అనసూయ.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఓ పాట మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించి, ట్రయిలర్ ను కూడా విడుదల చేస్తారు. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీతో అనసూయకు అవార్డులు గ్యారెంటీ అంటున్నాడు దర్శకుడు రాజేష్ నాదెండ్ల.