ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ కి రెడీ అయిన బెల్లంకొండ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ కొడుగ్గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఒక్క సరైన హిట్ ని అందుకోలేక పోయాడు. ఇక బెల్లంకొండ లేటెస్ట్ సినిమా అయిన “కవచం” కూడా భారీ ఫ్లాప్ గా నిలిచి బెల్లంకొండ కి ఉన్న మార్కెట్ ని కూడా డౌన్ చేసింది. ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్ ఉన్నా కూడా బెల్లంకొండ కి హిట్ ఇవ్వలేకపోయింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ తోనే “సీత” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత బెల్లంకొండ ఒక బయోపిక్ లో నటించనున్నాడు. ఈ సినిమా స్టోరీ 1970లలో బాగా పాపులర్ అయిన స్టువర్ట్ పురం దొంగ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్… పాయల్ రాజ్ పుత్, నిధి అగర్వాల్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడట. ఇప్పటికే నిర్మాతలు ఈ ఇద్దరు డేట్స్ ని బెల్లంకొండ శ్రీనివాస్ కోసం లాక్ చేసినట్టు తెలుస్తోంది.