వెరైటీ టైటిల్ తో…. నాగ శౌర్య

గత ఏడాది సొంత ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించిన “ఛలో” సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకున్నాడు నాగ శౌర్య.

ఆ సినిమా తరువాత మళ్ళీ సొంత ప్రొడక్షన్ లో “నర్తనశాల” మూవీ తో వచ్చి ఘోరమైన ఫ్లాప్ ని చవి చూశాడు నాగ శౌర్య. ప్రస్తుతం నాగ శౌర్య నందిని రెడ్డి దర్శకత్వంలో “ఓ బేబీ ఎంత సక్కగున్నవే” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంతా లీడ్ లో నటిస్తుంది.

ఈ సినిమా తరువాత నాగ శౌర్య అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాని “పలానా అబ్బాయి…. పలానా అమ్మాయి” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట హీరో, డైరెక్టర్. దీన్ని బట్టి చూస్తుంటే అవసరాల తనదైన స్టైల్ లోనే సినిమాని అందించబోతున్నాడని అర్ధం చేసుకోవచ్చు.

అవసరాలతో ఇప్పటికే నాగశౌర్య రెండు సినిమాలు చేసాడు. “ఊహలు గుసగుసలాడే” ‘‘జో అచ్యుతానంద’’ వంటి రెండు సినిమాలూ డీసెంట్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.