“మజిలి” కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ

“నిన్ను కోరి” సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే డీసెంట్ హిట్ ని అందుకున్నాడు శివ నిర్వాణ. ప్రస్తుతం శివ నిర్వాణ నాగ చైతన్య ని హీరోగా పెట్టి డైరెక్ట్ చేసిన “మజిలి” సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. అక్కినేని సమంతా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం తో సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉంటే శివ నిర్వాణ తన తదుపరి సినిమాని విజయ్ దేవరకొండ తో డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇటీవలే విజయ్ ను కలిసి ఒక కథను కూడా వినిపించాడట. కథ బాగా ఉండటంతో విజయ్ కూడా ఆసక్తి చూపుతున్నాడట.

కానీ “మజిలి” సినిమా రిలీజ్ అయిన తరువాత ఏ విషయం చెబుతాడాని తెలుస్తోంది. అంటే “మజిలి” సినిమా రిజల్ట్ బట్టి విజయ్ దేవరకొండ శివ నిర్వాణకి అవకాశం ఇవ్వాలా?వద్దా? అనేది డిసైడ్ చేస్తాడట.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ మూడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల తరువాతే వేరే సినిమాల గురించి ఆలోచిస్తాడట విజయ్ దేవరకొండ.