ఫొటో పై క్లారిటీ ఇచ్చిన నిత్యా మీనన్

నిత్యా మీనన్.. సౌత్ ఇండియా లో అగ్ర శ్రేణి హీరోయిన్లలో ఒకరు. ఆవిడ కి ఏ పాత్ర ఇచ్చినా ఇట్టే చేసేయ్యగలదు అనే పేరు అతి తక్కువ సమయం లోనే సంపాదించింది. అయితే ఈ భామ ప్రస్తుతం తెలుగు లో పెద్దగా సినిమాలు ఏమి చేయక పోయినా, వేరే భాషల్లో మంచి పాత్రలని సెలక్ట్ చేసుకుంటూ కెరీర్ లో ముందుకు పోతోంది.

అయితే ఈ మధ్య నిత్యా మీనన్ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఒకఫొటో పోస్ట్ చేసింది. అందులో ఒక కుర్రాడి ని హగ్ చేసుకొని కనిపించింది. అయితే ఆ ఫొటో లో ఉన్నది ఎవ్వరు? అనే క్లారిటీ మాత్రం నిత్య ఇవ్వక పోవడం తో చాలా మంది నిత్యా బాయ్ ఫ్రెండ్ అనుకున్నారట.

అదే ఉద్దేశ్యం తో కొంత మంది నిత్య కి మెసేజ్ కూడా చేశారట. అయితే నిత్య ఇప్పుడు ఈ వార్తలన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ ఫొటో లో ఉన్న వ్యక్తి ఎవరో కాదు నాకు సోదరుడి లాంటి వాడు. నాకు అత్యంత సన్నిహితమైన స్నేహితుడు అని చెప్పుకొచ్చింది.