విడుదలకు ముందే భారీ మొత్తాన్ని మూటగట్టుకున్న ‘డియర్ కామ్రేడ్’

ఈ మధ్యనే ‘టాక్సీవాలా’ సినిమాతో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన ‘డియర్ కామ్రేడ్’ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్ర బృందం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినిమా పై హైప్ పెరిగిపోవడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు.

అదేవిధంగా బయ్యర్లు కూడా ఈ సినిమాపై పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈచిత్రం థియేట్రికల్ రైట్స్ కు మంచి ధర పలికినట్లు తెలుస్తోంది. చదలవాడ శ్రీనివాసరావు ‘డియర్ కామ్రేడ్’ నైజాం రైట్స్ ను అక్షరాల 11 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నారని చెబుతున్నారు. ఆంధ్రా నుంచి కూడా ఈ చిత్రానికి 10 కోట్లు వచ్చాయని అంటున్నారు.

కేవలం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ చిత్రం 40 కోట్లు రాబట్టినట్లు వార్తలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించారు.