వంశీ పైడిపల్లిపై పూజా హెగ్డే కోపం

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకోవడం కామన్. మహర్షి సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. మహేష్ పై వంశీ పైడిపల్లి, నరేష్ పై మహేష్.. ఇలా ఒకర్నొకరు పొగుడుకుంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కాస్త తేడా కొడుతోంది పూజా హెగ్డే వ్యవహారశైలి. ఆమె వంశీ పైడిపల్లిని తిడుతోంది. అతడిపై చాలా కోపంగా ఉంది. దీనికి ఓ కారణం ఉంది.

ఈ మధ్యే తెలుగులో డబ్బింగ్ స్టార్ట్ చేసింది పూజా హెగ్డే. త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. అదే ఊపులో మహర్షి సినిమాకు కూడా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంది. కానీ దర్శకుడు వంశీ పైడిపల్లి మాత్రం ఒప్పుకోలేదు. పూజాకు వేరే అమ్మాయితో డబ్బింగ్ చెప్పించారు. ఇది పూజాకు నచ్చలేదు. అందుకే వంశీపై చాలా కోపంగా ఉందామె.

కేవలం డబ్బింగ్ కోసమే ఎంతో కష్టపడి తెలుగు నేర్చుకుంటున్నానని, అలాంటిది తన రెండో ప్రయత్నాన్నే వంశీ పైడిపల్లి ఆపేశాడని కోపంగా చెబుతోంది పూజ. ప్రభాస్ సినిమాకు మాత్రం కచ్చితంగా డబ్బింగ్ చెప్పి తీరతానంటోంది. అరవింద సమేత సినిమాలో పూజా హెగ్డే సొంత డబ్బింగ్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.