అఖిల్ చిత్రాన్ని లాంచ్ చేసిన నాగ్-అమల

మిస్టర్ మజ్ను తర్వాత అఖిల్ ఏం సినిమా చేస్తాడు అని అందరూ ఎదురు చూస్తున్న సమయం లో బొమ్మరిల్లు భాస్కర్ లైన్ లోకి వచ్చాడు. అనుకున్నట్లు గానే ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కింది.

గీత ఆర్ట్స్ బానర్ పై అల్లు అరవింద్ మరియు బన్నీ వాసు నిర్మాణం లో రానున్న ఈ సినిమా కి సంబందించిన ముహూర్త కార్యక్రమాలు నేడు ఉదయం హైదరాబాద్ లో ఘనం గా జరిగాయి.

అఖిల్ తో పాటు అతని తల్లిదండ్రులు నాగార్జున మరియు అమల కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి మణికంధన్ ఛాయాగ్రాహకుడి గా పని చేయనున్నాడు. వాసు వర్మ కూడా ఈ చిత్రానికి ఒక నిర్మాత.

గోపి సుందర్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కి ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. ఇక పోతే ఒంగోలు గిత్త తర్వాత ఈ సినిమా తో భాస్కర్ తెలుగు లోకి రానుండటం తో మళ్ళీ బొమ్మరిల్లు వంటి విజయం ఈ సినిమా తో రిపీట్ కావాలని అందరూ ఆశిస్తున్నారు. త్వరలో ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ మొదలు కానుంది.