‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమా రివ్యూ

రివ్యూ: ఫలక్‌నుమా దాస్‌
రేటింగ్‌: 2/5
తారాగణం: విశ్వక్ సేన్, సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమాటం తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాత:  కరాటే రాజు, చర్లపల్లి సందీప్, మనోజ్ కుమార్
దర్శకత్వం:  విశ్వక్ సేన్

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఈసారి నటుడిగానే కాక దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తాజాగా ‘ఫలక్‌నుమా దాస్‌’ అనే సినిమాతో యువ హీరో ఇప్పుడు దర్శకుడిగా మారాడు. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్ మరియు మీడియా నైన్ క్రియేటివ్ వర్క్స్ నిర్మించిన ఈ చిత్రానికో వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. హర్షిత గౌర్ మరియు సలోని మిశ్రా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. 

దాస్ (విశ్వక్ సేన్) హైదరాబాద్ లోని ఫలక్‌నుమా ఏరియా లో నివసిస్తూ ఉంటాడు. మాంసం బిజినెస్ చేసే ఇతని జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది. అయితే అనుకోకుండా ఎవరో చేసిన తప్పు తన మీద పడటంతో దాస్ జీవితం చిన్నాభిన్నం అవుతుంది. ఈ నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు దాస్. కోపంతో రగిలి పోతున్న దాస్ ఏం చేశాడు? ఆ నేరం నుంచి తను ఎలా బయటకు వచ్చాడు? చివరికి ఏమైంది అనేది తెలియాలంటే సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.

కథ ప్రకారం ఈ సినిమా మొత్తం విశ్వక్ సేన్ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎనర్జిటిక్ గా ఉండే తన పాత్ర చాలెంజింగ్ గా ఉన్నప్పటికీ…. యువ హీరో విశ్వక్ సేన్ ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచాడు. ‘ఏ నగరానికి ఏమైంది’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో విశ్వక్ నటనలో మరింత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తన పర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. సలోని మిశ్రా, హర్షిత గౌర్ అందంతో మాత్రమే కాక తమ నటనతో కూడా బాగా మెప్పించారు. విశ్వక్ తో వారి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. తరుణ్ భాస్కర్ తన పాత్రకు పూర్తిస్తాయలో న్యాయం చేసి పాత్రకు ప్రాణం పోశారు. దర్శకుడిగానే కాక నటుడిగా తరుణ్ టాలెంట్ అద్భుతం. ప్రశాంతి నటన ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. అభినవ్ గోమాటం మంచి కామెడీ టైమింగ్ తో మెప్పిస్తాడు. మిగతా అందరు నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

దర్శకుడు విశ్వక్ ఈ సినిమా కోసం ఒక మంచి కథను తయారు చేశారు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ వంటి కమర్షియల్ ఎలెమెంట్స్ అన్నీ దండిగా ఉంటాయి. మొదటి సినిమా అయినా విశ్వక్ సేన్ కథను చెప్పే విధానం కూడా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. వివేక్ సాగర్ అందించిన సంగీతం కూడా సినిమాలో హైలైట్ గా నిలిచింది. పాటల కంటే వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమా లో అన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమాకు విద్యాసాగర్ మంచి విజువల్స్ ను అందించారు. కెమెరా యాంగిల్స్ కూడా బాగున్నాయి. రవితేజ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

బలాలు:

నటీనటులు
ఫస్ట్ హాఫ్

బలహీనతలు:

కొన్ని సన్నివేశాలు, 
సెకండ్ హాఫ్

చివరి మాట:

పేరుకి మలయాళం సినిమా రీమేక్ అయినప్పటికీ దర్శకుడు విశ్వక్ సేన్ ఈ సినిమా కథను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి నుంచి ఆఖరివరకు ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమా కు బలమైన కథ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. ఈ కథను అందరికీ కనెక్ట్ అయ్యేలా గా బాగానే మలిచారు కానీ ఆశించినంత బాగా సినిమా రాలేదు. సినిమాలో మైనస్ పాయింట్లు అంటే ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచారు కానీ సినిమాలో అంత సీన్ లేకపోవడం. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ కూడా దర్శకుడు బాగానే హ్యాండిల్ చేశాడు. ఇక చివరగా ‘ఫలక్‌నుమా దాస్‌’ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోవచ్చు.

అనుకున్నంత రేంజిలో ఆకట్టుకోలేకపోయిన ‘ఫలక్‌నుమా దాస్‌’.