రాజుగారి గది-3 కూడా స్టార్ట్ అయింది

టైటిల్ ఒకటే ఉంటుంది. కానీ కథలు మారిపోతాయి. దానికి తగ్గట్టే హీరో హీరోయిన్లు, నటీనటులు కూడా మారిపోతుంటారు. ప్రస్తుతం సీక్వెల్స్ లో నడుస్తున్న ట్రెండ్ ఇది. ఈ ఫార్ములాను అచ్చుగుద్దినట్టు ఫాలో అవుతోంది రాజుగారి గది-3 సినిమా. ఈరోజు ప్రారంభమైన ఈ సినిమాకు నాగార్జునకు ఎలాంటి సంబంధం లేదు.

రాజుగారిగది-3 అనగానే నాగార్జున ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తాడని అంతా ఎదురుచూశారు. కానీ ఇది నాగార్జున చేయాల్సిన సినిమా కాదు. ఇందులో మెయిన్ రోల్ తమన్నాది. ఆమె చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఓంకార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో తమన్న సరసన అతడి తమ్ముడు అశ్విన్ హీరోగా నటించబోతున్నాడు.

రేపట్నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను, హరితేజ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు ఓంకార్ ఈ సినిమాను డైరక్ట్ చేయడమే కాకుండా, తన సొంత బ్యానర్ ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు కూడా. మ్యూజిక్ డైరక్టర్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.