బాలీవుడ్…. కోలీవుడ్…. ఇప్పుడు సాండల్‌ వుడ్ కి….

అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు మరికొన్ని భాషల్లో రీమేక్ అవుతోంది.

ఒకవైపు విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న తమిళ ‘అర్జున్ రెడ్డి’ సినిమా ‘ఆదిత్య వర్మ’ అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరోవైపు షాహిద్ కపూర్, కీయార అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించిన హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ జూన్ 21 న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అర్జున్ రెడ్డి సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది.

తాజాగా ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఇప్పుడు మరొక భాషలో రీమేక్ అవ్వబోతున్నట్టు సమాచారం.

ప్రముఖ ఫిల్మ్ మేకర్ నారాయణ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాని కన్నడలో రీమేక్ చేయబోతున్నారట. ఇప్పటికే సినిమా రీమేక్ రైట్స్ ని భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవనున్నట్టు సమాచారం. మరి ఈ సినిమా లో కాస్ట్ అండ్ క్రూ గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.