కలబంద… అందం ఆరోగ్యం

కొన్ని సంవత్సరాల క్రితం కలబందను గుమ్మానికి లేదా ఇంటి చూరుకి వేళ్లాడదీసేవారు… ఎందుకూ అంటే ఇంట్లోకి బల్లులు, పాములు ఇతర కీటకాలు రావు అని పెద్దలు చెప్పేవారు.

అప్పట్లో కలబంద గురించి అవగాహన అంతే. కాని నేడు కలబంద ప్రతి ఇంటిలోను ఉండాల్సిన మొక్క. శరీరంలో అనేక రుగ్మతలతో పాటు, జుట్టు, చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుందని చెబుతున్నారు వైద్యలు. అది ఏమిటో .. ఎలాగో చూద్దాం.

  • కలబంద లోపలి భాగాన్ని కోడిగుడ్డు తెలసొనలో కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే జుట్టు వొత్తుగా, బలంగా పెరుగుతుంది.
  • కలబందలో లాక్టెట్, మెగ్నీషియం గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కండరాలు, కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తాయి.
  • మధుమేహంతో బాధపడుతున్న వారు రోజూ పరగడుపునే కలబంద తింటే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్థులకు కలబంద దివ్యౌషధం.
  • కలబంద జ్యూస్ ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రావని, పచ్చకామెర్లకు కలబంద జ్యూస్ మంచి ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • జుట్టు రాలడం, చుండ్రు, తలలోని కురుపులు, జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను కలబంద నివారిస్తుంది.
  • కలబంద జిగురుకు కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఇక ఫేషియల్ అవసరం ఉండదు.
  • కలబంద జ్యూస్ ప్రతిరోజు తీసుకుంటే మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు.
  • బరువు తగ్గాలనుకునే వాళ్లు కలబంద జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • స్త్రీల రుతు సమస్యలకు కలబంద మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  • కలబందలో 15 రకాల పోషకాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇది మధుమేహం, చర్మం, మూత్రపిండాల సమస్యలే కాక ఇంకా చాలా రకాల అనారోగ్యాల నుంచి కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.