బన్నీ తో …. రాశి కన్నా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు బన్నీ. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సినిమాల తరువాత బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ సినిమా ఇది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం తాలూకు రెగ్యులర్ షూట్ వచ్చే నెల నుంచి మొదలవ్వబోతోంది. వచ్చే నెల నుంచి వేణు శ్రీరామ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల షూటింగ్ ఒకేసారి జరగనుంది.

తాజాగా వేణు శ్రీరామ్-బన్ని సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో రాశికన్నా హీరోయిన్ గా నటించనుందట. న్యూ ఏజ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బన్నీ తో రొమాన్స్ చేయనుంది ఈ ‘తొలిప్రేమ’ బ్యూటీ.

ఇప్పటిదాకా వరుణ్ తేజ్ మరియు సాయి ధరంతేజ్ లాంటి మెగా హీరోలతో రొమాన్స్ చేసిన రాశి కన్నా ఈ సినిమాతో అల్లు హీరో తో జత కట్టనుంది. టైటిల్ కు తగ్గట్టు గానే అల్లు అర్జున్ ఈ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపించబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి లో విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ప్రముఖ నటీనటులు మరియు టెక్నీషియన్లను రంగంలోకి దింపనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు బన్నీ.