అనంత శ్రీరామ్‌ని ఉతికి ఆరేసిన నెటిజన్‌లు

వయసులో చాలా చిన్నవాడు. ఏవో కొన్ని పాటలు రాశాడు. పేరొచ్చింది. బాగా పాపులర్‌ అయ్యాడు. సినిమా పాటలో, శృంగార గీతాలో రాసుకుంటూ దర్జాగా బ్రతికేస్తున్న ఇతను… అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చి తన అభిప్రాయాలను చెబుతూ ఉంటాడు. మోడీ నోట్ల రద్దు చేసినప్పుడు అందరూ మోడీని విమర్శిస్తుంటే అనంత శ్రీరామ్‌ మాత్రం ఒక పాట రాసి మోడీ చర్యను వ్యతిరేకించిన భారతీయులందరినీ విమర్శించాడు.

మళ్ళీ ఇప్పుడు తాజాగా అనంత శ్రీరామ్‌ రెండు రోజుల క్రితం…. 49 మంది భారతీయ మేథావులు ప్రధానికి రాసిన ఒక లేఖ మీద మండిపడ్డాడు.

కుహనా మేథావులు మళ్ళీ సకిలించారు…. అంటూ ఆ మేథావుల మీద విరుచుకుపడ్డాడు.

అది చదివిన నెటిజన్‌లు…. ఆయన పాటల్లో ఉండే బూతులు మించిన బూతు పదాలతో మండిపడ్డారు. మరికొందరైతే అనంత శ్రీరామ్‌ని, అతని రాజకీయ అజ్ఞానాన్ని ఉతికి ఆరేశారు.

అంత గొప్ప మేథావులను విమర్శించే స్థాయి నీది కాదు…. నీ బూతు పాటలేవో నువ్వు రాసుకుంటూ ఉండు తప్ప…. వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు వాళ్ళను విమర్శించడం అంటే సూర్యుడు మీద ఉమ్మి వేయడం లాంటిదని మండిపడ్డారు.