బాలకృష్ణతో… వాళ్ళు ఒప్పుకోలేదు… ఈమె ఒప్పుకుంది

ఒక వైపు నాగార్జునతో నటించడానికి మంచి హీరోయిన్లు దొరుకుతున్నప్పటికి మిగతా సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లకు హీరోయిన్లు దొరకడం చాలా పెద్ద కష్టమైన పనిగా మారిపోయింది.

తమన్నా, పాయల్ రాజ్ పుత్ లు సీనియర్ హీరోలలో రొమాన్స్ అంటే భారీ రెమ్యూనరేషన్ లు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఒకప్పుడు స్టార్డమ్ అనుభవించిన హీరోయిన్ లను ఎంపిక చేసుకుంటున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక మరియు భూమిక చావ్లా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు

ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ గ్లామరస్ పాత్రలో కనిపించబోతోందట. ముఖ్యంగా మాల్దీవ్స్ మరియు బ్యాంకాక్ లలో జరిగిన షూటింగ్ లో సోనాల్ చౌహాన్ బికినీతో యువతను ఉర్రూతలూగించనుందట.

ఈ సినిమా కోసం సోనాల్ చౌహాన్ 45 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు హెబ్బాపటేల్, ప్రగ్యా జైస్వాల్ వంటి హీరోయిన్లు ఇంతకంటే తక్కువ రెమ్యూనరేషన్ లకు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు…. కానీ బాలకృష్ణ వంటి సీనియర్ హీరో తో సినిమా అంటే వారు ఒప్పుకోవడం లేదు. అందుకే సోనాల్ చౌహాన్ ఇప్పుడు సీనియర్ హీరోల కి బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది.