మొక్కజొన్న తోటలో ల్యాండ్ అయిన విమానం

రష్యా విమానమొకటి ఆగస్టు 15న ఘోర ప్రమాదం నుంచి బయట పడింది. ఓ పక్షుల గుంపు విమానాన్ని గుద్దుకోవడం తో విమానం ఇంజన్ దెబ్బ తింది. దీంతో పైలెట్ విమానాన్ని మొక్కజొన్న పొలాల్లో అత్యవసరంగా దించాడు. ఫలితం గా 23 మంది గాయపడ్డారు.

ఇది నిజం గా మిరాకిల్ అనీ, పైలట్ చాకచక్యం వల్లే బతికి బయట పడ్డామని ప్రయాణికులు అతడిని హీరోని చేశారు.

మాస్కో లోని ఝుకోవ్ స్కి అంతర్జాతీయ విమానాశ్రయం లో టేకాఫ్ అయిన యూరల్ ఎయిర్ లైన్స్ ఎయిర్ బస్ 321… కొద్ది క్షణాల్లోనే పక్షులు గుద్దుకోవడం తో ఇంజిన్ పాడై పోయింది. పైలట్ సమయస్పూర్తి తో వెంటనే మొక్కజొన్న పొలాల్లో దించాడు.

ఈ ప్రమాదం మాస్కోకి ఒక కిలో మీటర్ దూరం లో జరిగింది. మొత్తం 233 మంది ప్రయాణికులు ఉన్నా ఎవరూ మరణించకుండా కొద్దిమంది గాయాలతో బయట పడటం ఓ నమ్మ లేని అద్భుతమని రష్యన్ అధికార టీవీ వర్ణించింది.
ఇంటర్ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ… ఒకరు తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ చెప్పింది.

లాండింగ్ గేర్లు వేయకుండా, “ఇంజన్ పతనం అవుతుంటే మొక్కజొన్న పొలల్లో ఇంత భద్రం గా దించడం” అద్భుతం అంటూ.. ప్రావ్దా టాబ్లాయిడ్ పైలట్ ని ఆకాశానికెత్తింది.

ఈ సంఘటనను 2009 లో హడ్సన్ నదిలో అమెరికా విమానం లాండ్ అయిన సంఘటన తో కొందరు పోల్చుతున్నారు.