దక్షిణాది హీరోల ముందు బాలీవుడ్ తేలిపోయింది….

దేశంలోనే నంబర్ 1 చిత్ర పరిశ్రమ హిందీనే. ఒకప్పుడు హిందీలోనే మన చిత్ర పరిశ్రమ మొదలైంది. ఆ తర్వాత చెన్నై కేంద్రంగా దక్షిణాది సినిమా విస్తరించింది. పది, పదిహేనేళ్ల కిందటి వరకు బాలీవుడ్ సినిమాలే దేశంలో రాజ్యమేలేవీ.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

దక్షిణాది సినిమాలు సత్తాచాటుతున్నాయి. హిందీలో రిమేక్ అవుతున్నాయి. మన దర్శకులతో ఇదే కథలను తీసుకొని బాలీవుడ్ లో తీస్తున్నారు. ఇక బాహుబలి, కబాలి, దక్షిణాది చిత్రాలు హిందీకి వెళ్లి సత్తా చాటాయి. సాహో, సైరా కూడా రెడీ అయ్యాయి.

ఈ నేపథ్యంలో దేశ సినిమా రంగంపై దక్షిణాది సినిమాలు, హీరోల ప్రభావం బాగా ఉందన్న విషయం అర్థమైపోయింది. తాజాగా ట్విట్టర్ ట్రెండింగ్స్ లోనూ అదే కనిపించడం విశేషం.

దేశంలోనే నంబర్ 1 హ్యాష్ ట్యాగ్ గా తమిళ హీరో అజిత్ నటించిన ‘విశ్వాసం’ మూవీ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఇక రెండో స్థానంలో మేలో జరిగిన ‘లోక్ సభ ఎలక్షన్స్ 2019’ గురించి నెటిజన్లు వెతికారట.

ఇక మూడో హ్యాట్ ట్యాగ్ ‘క్రికెట్ వరల్డ్ కప్’. నాలుగో స్థానంలో మన టాలీవుడ్ హీరో మహేష్ నటించి ‘మహర్షి’ మూవీ ఉంది.

ఇటీవల రైతులపై తీసిన ఈ సినిమాలోని ‘వీకెండ్ అగ్రికల్చర్’ కాన్సెప్ట్ ట్విట్టర్ లో వైరల్ అయ్యింది. ఇక ఐదో స్థానంలో ‘న్యూ ప్రొఫైల్ పిక్’ అనే హ్యాష్ ట్యాగ్ నిలిచింది.

ఇలా బాలీవుడ్ సినిమాలు, హీరోలను పక్కనపెట్టి టాలీవుడ్ హీరోలు అజిత్, మహేష్ లు ట్విట్టర్ లో దున్నేస్తుండడం టాప్ లో నిలవడం గర్వకారణంగా చెప్పవచ్చు.