చైతూ, సాయిపల్లవి కలిసే టైమ్ వచ్చింది

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సాయిపల్లవి హీరోయిన్. ఈ సినిమాకు ఎట్టకేలకు కాల్షీట్లు కేటాయించాడు చైతూ. వచ్చే నెల 5 నుంచి శేఖర్ కమ్ముల సినిమా సెట్స్ పైకి రాబోతున్నాడు.

ఫిదా టైపులో ఈ సినిమాలో కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతుంది సాయిపల్లవి. ఆమెను ప్రేమిస్తూ, ఆమెను తన ప్రేమలో పడేసే పాత్రలో నాగచైతన్య కనిపించబోతున్నాడు. ఏఆర్ రెహ్మాన్ శిష్యుడు పవన్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇదే సినిమాను గతంలో కొంతమంది నూతన నటీనటులతో ప్లాన్ చేశాడు శేఖర్ కమ్ముల. దాదాపు 80శాతం షూటింగ్ కూడా పూర్తిచేశాడు. అయితే కొత్త నటుల యాక్టింగ్ శేఖర్ కమ్ములకు నచ్చలేదు. అందుకే వాళ్లను తీసేసి.. నాగచైతన్య, సాయిపల్లవిని హీరోహీరోయిన్లుగా పెట్టాడు. మిగతా పోర్షన్ లో నటించిన నటీనటులందర్నీ అలానే ఉంచాడు. అందుకే సినిమాను మరో 2 నెలల్లో పూర్తిచేయబోతున్నారు. డిసెంబర్ లో రిలీజ్ చేస్తారు.