బాలయ్య మూవీ అప్ డేట్స్

సినిమా మొదలు పెట్టడమే ఆలస్యం. ఒక్కసారి మొదలైందంటే దాన్ని పూర్తిచేసే వరకు గ్యాప్ తీసుకోడు బాలకృష్ణ. లాంగ్ గ్యాప్ తర్వాత కొత్త సినిమా స్టార్ట్ చేసిన ఈ హీరో, ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశాడు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన 105వ సినిమాను బాలయ్య స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. థాయ్ లాండ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడా షెడ్యూల్ ను బాలయ్య కంప్లీట్ చేశాడు. చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో 2 పాటలు, కొంత టాకీపార్ట్‌, భారీ యాక్షన్‌ ఏపిసోడ్‌ను షూట్‌ చేశారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా కీలక పాత్రలు నటిస్తున్నారు.

కుదిరితే డిసెంబర్ లో, కుదరకపోతే ఫిబ్రవరిలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తుండగా.. సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తో ఘోరంగా దెబ్బతిన్న బాలయ్య, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే వెంటనే మరో మూవీ మొదలుపెడతాడు. లేదంటే మరోసారి గ్యాప్ తప్పదు.