ఐకాన్ పై సాహో ఎఫెక్ట్

తెలుగులో రాబోతున్న చాలా సినిమాలపై సాహో ప్రభావం పడింది. సాహో ఫెయిల్యూర్ చూసి కొన్ని సినిమాలు పాఠాలు నేర్చుకుంటే, మరికొంతమంది సాహోకు వచ్చిన ఓపెనింగ్స్, సినిమాలో గ్రాండియర్ లుక్ చూసి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ రెండో రకానికి చెందిన వ్యక్తి అల్లు అర్జున్.

దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేయడానికి అంగీకరించాడు బన్నీ. ఇది పాత విషయమే. అయితే సాహో వచ్చిన తర్వాత బన్నీ ఆలోచనలు మారిపోయాయి. ఐకాన్ సినిమాను కూడా సాహో రేంజ్ లో భారీగా తీస్తే బాగుంటుందనేది బన్నీ ఆలోచన. ఈ మేరకు కొన్ని సన్నివేశాల్ని మార్చి, బడ్జెట్ ను భారీగా పెంచాలని దిల్ రాజుకు సూచించాడట బన్నీ. అవసరమైతే మరో నిర్మాతను కూడా భాగస్వామిగా చేర్చుకొని ఐకాన్ ను పాన్-ఇండియా మూవీగా మార్చాలని ఆదేశించాడట.

బన్నీ తాజా సూచనలతో ఐకాన్ సినిమాకు మరోసారి మార్పుచేర్పులు తప్పలేదు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ను 3 సార్లు మార్చాడు వేణుశ్రీరామ్. ఇప్పుడు సాహో రాకతో ఐకాన్ లో మరోసారి మార్పులు తప్పలేదు. ప్రస్తుతం అల వైకుంఠపురం అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. అప్పటికి బన్నీ చెప్పిన మార్పులతో ఐకాన్ రెడీ అయితే అదే ప్రారంభమౌతుంది. లేదంటే సుకుమార్ సినిమా సెట్స్ పైకి వస్తుంది.