గ్యాంగ్ లీడర్ ప్రీ-రిలీజ్ బిజినెస్

నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 23 కోట్ల 80 లక్షల రూపాయలకు (అడ్వాన్స్ లతో కలిపి) అమ్మారు. ఇంతకుముందు నాని నటించిన జెర్సీ సినిమాకు సీడెడ్, ఈస్ట్ లాంటి ఏరియాస్ లో నష్టం వచ్చింది. అటు మైత్రీ నిర్మాతలు తీసిన డియర్ కామ్రేడ్ సినిమాతో చాలామంది బయ్యర్లు నష్టపోయారు. అందుకే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి తీసిన గ్యాంగ్ లీడర్ సినిమాను నామమాత్రపు రేట్లకు మాత్రమే ఇచ్చారు.

కృష్ణా ఏరియా రైట్స్ ను జస్ట్ కోటిన్నరకే ఇచ్చారు. అటు వెస్ట్ రైట్స్ ను కూడా కోటి 30 లక్షలకే ఇచ్చారు. ఇలా నైజాం తప్ప చాలా ఏరియాల్లో హక్కులను నామమాత్రపు రేట్లకు అమ్మారు. ఇలా చేయడం వల్ల అటు నాని, ఇటు మైత్రీ నిర్మాతలపై బయ్యర్లకు నమ్మకం పెరిగింది. దీనికితోడు సినిమాకు ఏమైనా హిట్ టాక్ వచ్చిందంటే.. అంతా లాభాలు కళ్లజూస్తారు. ఏపీ, నైజాంలో గ్యాంగ్ లీడర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 9 కోట్లు
సీడెడ్ – రూ. 3.5 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4 కోట్లు
ఈస్ట్ – రూ. 1.75 కోట్లు
వెస్ట్ – రూ. 1.3 కోట్లు
కృష్ణా – రూ. 1.5 కోట్లు
గుంటూరు – రూ. 2 కోట్లు
నెల్లూరు – 75 లక్షలు