కాంగ్రెస్‌కు ఊర్మిళ గుడ్ బై… బీజేపీలో చేరుతారా ?

మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌ర‌గబోతున్నాయి. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. బాలీవుడ్ ప్ర‌ముఖ హీరోయిన్ ఊర్మిళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందే ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్‌లో చేరారు. ముంబై నార్త్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. బీజేపీ అభ్య‌ర్థి గోపాల్ షెట్టి చేతిలో 4 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ముంబై కాంగ్రెస్‌లో అంత‌ర్గత రాజ‌కీయాల వ‌ల్లే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. కొంద‌రి స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం తాను ప‌ని చేయలేనని అన్నారు. అయితే ఆమె త్వ‌ర‌లోనే బీజేపీలో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ముంబైలోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్‌లో కీల‌క నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే ఎన్సీపీ స‌హా కీల‌క నేత‌ల‌పై ఈడీ, సీబీఐ కేసులు న‌డుస్తున్నాయి.