‘జాన్’ షూటింగ్ లోకి…. ప్రభాస్

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్….. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సాహో’ సినిమా తో మాత్రం అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయాడు.

సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఓకే అనిపించింది. అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ అనే సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తి అయిపోయింది. సాహో కోసం ఈ సినిమాని కొన్నిరోజులపాటు హోల్డ్ లో పెట్టిన ప్రభాస్ ఇప్పుడు మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాడట.

తాజా సమాచారం ప్రకారం త్వరలో ప్రభాస్ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నాడట. మరి కొన్ని వారాలలో ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి లో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఫాంటసీ ప్రేమ కథ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు యూరోప్ లో జరగనుంది. యు.వి.క్రియేషన్స్ మరియు గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్ అవతారంలో, క్లీన్ షేవ్ లుక్ తో కనిపించబోతున్నాడు.