ఆర్ఆర్ఆర్ .. ఫుల్ టైటిల్ ఇదేనట ?

బాహుబలి సినిమా తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టైటిల్ కూడా పెట్టకుండా రాజమౌళి తీస్తున్న ఈ మూవీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హైప్ నెలకొంది. బాలీవుడ్ నుంచి కోలివుడ్ దాకా జక్కన్న తీసే చిత్రంపైనే ఫోకస్ పెట్టింది. అయితే టైటిల్ ను ముందే అనౌన్స్ చేసే రాజమౌలి ఈసారి మాత్రం ఇద్దరు తెలుగు యోధుల కథకు టైటిల్ దొరకబట్టలేకపోయారు. అందుకే ప్రస్తుతానికి ‘ఆర్ఆర్ఆర్’గా సినిమాకు పరోక్ష టైటిల్ గా కొనసాగించేస్తున్నారు.

దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొమురం భీంగా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్నారు. 2020 జూలై 30న రిలీజ్ కు ప్లాన్ చేశారు. ప్రస్తుతం రామౌజీ ఫిలింసిటీలో దీని షూటింగ్ జరుగుతోంది.

బాహుబలి సినిమాకు ముందే టైటిల్ ఫిక్స్ చేసి అన్ని భాషలకు ఒకటే టైటిల్ తో వెళ్లిన రాజమౌళి.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కు మాత్రం.. ఏ భాషకు ఆ భాషలో సపరేట్ టైటిల్ పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది. తెలుగులో ఆర్ఆర్ఆర్ కు ‘రామ రౌద్ర రుషితం’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు తెలిసింది. ఇక ఇతర భాషల్లో ‘రైజ్ రివోల్డ్ రివేంజ్’ అని పెట్టబోతున్నారట..

ఇలా టైటిల్ లోనే ఇన్ని వేరియేషన్స్ చూపిస్తున్న రాజమౌళి సినిమాలో ఇంకెత వైవిధ్యం చూపిస్తాడోనన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. బాలీవుడ్ సినిమాపై తెలుగు ఆధిపత్యం కొనసాగుతున్న వేళ ఇప్పుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది ఆసక్తిగా మారింది..