సానియా చెల్లితో అజర్ కొడుకు నిఖా పక్కా

  • ఆనం మీర్జాతో మహ్మద్ అసదుద్దీన్ డేటింగ్

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్… తమ ఇంటిచిన్నల్లుడు కాబోతున్నట్లు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రకటించింది.

గత కొద్దిమాసాలుగా సానియా సోదరి ఆనం మీర్జా, అజర్ తనయుడు అసద్ చెట్టాపట్టాలేసుకు తిరగడంతో…వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే …రెండు కుటుంబాలు ఆ వార్తను ధృవపరచుకుండా దాగుడుమూతలు ఆడినా…ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరదించాయి.

తన సోదరి నిఖా వార్త గురించి సానియానే స్వయంగా ప్రకటించింది. డిసెంబర్ లో ఆనం ను అసద్ వివాహం చేసుకొంటాడని… ప్రస్తుతం పారిస్ లో చదువుతున్న ఆనం మీర్జా గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే నిఖా జరిపించాలని నిర్ణయించినట్లు సానియా అధికారికంగా ప్రకటించింది.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను సానియా నిఖా చేసుకొన్న సమయంలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే..ఆనం మీర్జా మాత్రం.. తన భర్తగా ఓ హైదరాబాదీనే ఎంపిక చేసుకోడంతో వివాదానికి తావులేకుండా పోయింది.

హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఇటీవలే ఎన్నికైన మహ్మద్ అజరుద్దీన్ ఇంట త్వరలోనే మొత్తం మీద పెళ్లిబాకాలు మోగబోతున్నాయి.