లండన్ తెరమీద హిందీ బాహుబలి…

ప్రధాని మోడీ దేశంలోని బాలీవుడ్ సెలబ్రిటీలను మాత్రమే పిలిచి పార్టీ ఇచ్చిన తీరుపై ఇప్పటికే సౌత్ ఇండియా స్టార్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సౌత్ హీరోలను ఇండియన్ సినిమా ప్రతినిధులుగా గుర్తించిన సమయంలోనే ప్రపంచ వేదికపై సౌత్ సినిమా అదీ.. మన తెలుగు బాహుబలి నఇ రాయల్ ఆల్బర్ట్ మ్యూజిక్ హాల్ లో ప్రదర్శించడం మోడీకి, బాలీవుడ్ కు చెంపపెట్టులాంటి సమాధానమే.

అయితే , అంతాబాగానే ఉన్న లండన్ లోని ఆ ప్రఖ్యాత థియేటర్ లో బాహుబలి తెలుగు వెర్షన్ ను వారు అక్కడ ప్రదర్శించకపోవడం తెలుగు వారిని హర్ట్ చేసింది. ఈ క్రెడిట్ ను కూడా బాలీవుడ్ తీసుకోవడం విస్మయ పరిచింది. లండన్ థియేటర్ లో హిందీ బాహుబలిని ప్రదర్శించడం దుమారం రేపింది. కొందరు తెలుగు సినీ జనాలు దీనిపై మండిపడుతున్నారు.

హిందీ సినిమా ప్రదర్శించడం ఈ హక్కు పొందిన హిందీ నిర్మాత కరణ్ జోహర్ మరియు అనిల్ తడాని చిత్రం పేరుపై వేయడం తెలుగు జనాలకు రుచించలేదు.

వాస్తవానికి రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఇంగ్లీష్ ఉపశీర్షికలతో ప్రదర్శించబడింది. వేదిక వద్ద వున్న చాలా మంది తెలుగు ప్రజలు హిందీ వెర్షన్ ను కూడా ఆస్వాదించగా, కొందరు హిందీ వెర్షన్ వద్దని అచ్చమైన తెలుగు సినిమాను ప్రదర్శించాలని కోరారు. దీనిపై నిరాశ కూడా వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో కూడా కొంతమంది వ్యక్తులు స్క్రీనింగ్ నుంచి క్లిప్ ను పంచుకున్నారు. బాహుబలిని ఒక బాలీవుడ్ చిత్రం లాగా హిందీ వెర్షన్ ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ బాహుబలి సినిమా ప్రదర్శనతో ఈ క్రెడిట్ వాళ్లకే లభిస్తుంది. ఈ విషయం రాజమౌళి , ప్రభాస్,రానా, కీరవాణియ, శోభు యర్లగడ్డతో సహా వేదికపై ఉన్న బాహుబలి టీం కు తెలియకపోయినా తెలుగు ప్రజలు హిందీ బాహుబలి ప్రదర్శనపై పెదవి విరుస్తున్నారు.