ఈసారి కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాడు

మహర్షి మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అల్లరి నరేష్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. విజయ్ కనకమేడల అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే అంతా అనుకుంటున్నట్టు ఇది కామెడీ సినిమా కాదు. పక్కా కాన్సెప్ట్ బేస్డ్ మూవీ.

ప్రస్తుతం తెలుగులో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచి చాలా మారిపోయింది. రీసెంట్ గా విడుదలైన ఖైదీ పెద్ద హిట్ అవ్వడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అందుకే అల్లరి నరేష్ కూడా మంచి కాన్సెప్ట్ కు ఓకే చెప్పాడు.

నిజానికి అల్లరినరేష్ కు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు కొత్తకాదు. గతంలోనే ఈ టైపు సినిమాలు కొన్ని చేశాడు ఈ హీరో. కాకపోతే అప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఇప్పుడు ఈ ట్రెండ్ మొదలైంది. అందుకే మరోసారి కాన్సెప్ట్ కథ ఎంచుకున్నాడు. పైగా కామెడీ జానర్ నుంచి మెల్లగా పక్కకు జరగాలని భావిస్తున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాను అంగీకరించడానికి ఇది కూడా ఓ కారణం.

ప్రస్తుతం బంగారు బుల్లోడు సినిమాను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు అల్లరోడు. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే విజయ్ కనకమేడల సినిమా ప్రారంభమౌతుంది. ఎస్వీ-2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇక్కడ సతీష్ వేగేశ్న అంటే శతమానంభవతి దర్శకుడు కాదు. ఇతడు వేరు.