స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై టీడీపీ వెబ్‌సైట్‌ అనుచిత కథనం

ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌ అనుచిత కథనం ప్రచురించింది. వెట్‌సైట్‌ ఈ- పేపర్‌లో తమ్మినేని సీతారాంను ధూషిస్తూ కథనం రాశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

గతంలో నకిలీ స్టాంపుల కుంభకోణం సమయంలో ఆ శాఖ మంత్రిగా ఉన్న తమ్మినేని ముడుపులు తీసుకున్నారని… మంత్రి పదవి నుంచి తొలగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే … అర్థరాత్రి చంద్రబాబు ఇంటికి వచ్చి మంత్రి పదవి తీసేస్తే పెట్రోల్ పోసుకుని అంటించుకుంటానని తమ్మినేని బట్టలు ఊడదీసుకున్నారని టీడీపీ వెబ్‌సైట్ ఆరోపించింది.

దున్నపోతులా సాంబారు తాగి వచ్చి అసెంబ్లీలో నిద్రపోతాడు అంటూ తమ్మినేనిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కథనం రాశారు. తమ్మినేని సీతారాంది ఒక బతుకేనా అని టీడీపీ వెబ్‌సైట్‌ రాసింది. ఇంకా అనేక విమర్శలు చేసింది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వైసీపీ నేత జోగి రమేష్ స్పష్టం చేశారు.